ఆధార్ సంస్థలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా (UIDAI) పలు ఖాళీలని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్న వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ డైరెక్టర్, సెక్షన్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రెటరీ లాంటి పోస్టుల భర్తీకి వేర్వేరుగా జాబ్ నోటిఫికేషన్స్ ని విడుదల చెయ్యడం జరిగింది. హైదరాబాద్‌, చండీగఢ్, ఢిల్లీ, ముంబై, లక్నో, రాంచీలో రీజనల్ ఆఫీసులలో ఉద్యోగాలు ఉన్నాయి. ఇక ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలలోకి వెళితే..

JOBS IN AADHAR CENTER

 

దీనిలో మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్‌లోని రీజనల్ ఆఫీసులో కేవలం 2 ప్రైవేట్ సెక్రెటరీ పోస్టులు మాత్రమే ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. శాలరీ విషయంలో పే మ్యాట్రిక్స్ లెవెల్ 8 వర్తిస్తుంది. వయస్సు 56 ఏళ్ల లోపు ఉండాలి. అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.

పోస్టుల వివరాలు:

ప్రైవేట్ సెక్రెటరీ- 7 (హైదరాబాద్-2, చండీగఢ్-3, ఢిల్లీ-1, లక్నో-1)
డిప్యూటీ డైరెక్టర్- 3 (చండీగఢ్-1, ముంబై-1, రాంచీ-1)
అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్- 2 (ఢిల్లీ-1, రాంచీ-1)
సెక్షన్ ఆఫీసర్- 3 (ఢిల్లీ-1, లక్నో-2)

హైదరాబాద్‌లోని పోస్టులకు దరఖాస్తుల్ని పంపాల్సిన అడ్రస్:
Assistant Dircetor, General (HR),
Unique Identification Authority of India (UIDAI),
Regional Office, 6th Floor,
East Block, Swarna Jayanthi Complex,
Beside Maitrivanam,
Ameerpet, Hyderabad- 500038