నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో అంగన్‌వాడీ పోస్టులు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఖాళీగా ఉన్న 135 అంగన్‌వాడీ Anganwadi పోస్టుల భర్తీకి మహిళా, సంక్షేమ అధికారి కార్యాలయం నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

అంగన్‌వాడీ /Anganwadi
అంగన్‌వాడీ /Anganwadi

ఈ నోటిఫికేషన్‌ ద్వారా అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు, మినీ అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత వున్నా వాళ్ళు ఈ పోస్ట్స్ కి అప్లై చెయ్యచ్చు. ఇక పోస్టుల వివరాలలోకి వెళితే.. మొత్తం ఖాళీలు 135, అంగన్‌వాడీ టీచర్లు – 36, అంగన్‌వాడీ ఆయాలు – 83, మినీ అంగన్‌వాడీ టీచర్లు – 16. అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జులై 15 వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. అభ్యర్థులు పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ లో https://mis.tgwdcw.in/ చూడొచ్చు.

అర్హత విషయంలోకి వస్తే.. పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి. అలాగే అభ్యర్థిని తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలి. అంతే కాదు స్థానికంగా గ్రామం అయితే గ్రామ పంచాయతీ పరిధిలో, పట్టణం అయితే స్థానిక మున్సిపాలిటీ వార్డులో నివసిస్తూ ఉండాలి.

వయస్సు 35 ఏళ్ళు మించకూడదు. నెలకు రూ. 15,000 – 45,000/- వస్తుంది. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్‌:https://mis.tgwdcw.in/

Read more RELATED
Recommended to you

Latest news