CAG రిక్రూట్‌మెంట్ 2021 పోస్టులు, జీతం, దరఖాస్తు వివరాలు విడుదల అవ్వడం జరిగింది. వాటి వివరాలు ఇవే..! పూర్తిగా ఇప్పుడే తెలుసుకోండి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (సిఎజి) అధికారులు తాజాగా ఈ వివరాలని అందించారు. విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 10811 ఆడిటర్లు, అకౌంటెంట్ల పోస్టులు ఉన్నట్టు తెలుస్తోంది. కాగ్ రిక్రూట్‌మెంట్ 2021 లో ఆసక్తి ఉన్నవారు తమ అధికారిక సైట్ @ cag.gov .in లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
CAG దరఖాస్తు ఫారం ను ఫిబ్రవరి 19 నాటికి సబ్మిట్ చెయ్యాలి. అదే చివరి తేదీ గుర్తుంచుకోండి. బాచిలర్స్ డిగ్రీ ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.అభ్యర్థులు CAG ఆడిటర్, అకౌంటెంట్ దరఖాస్తు ఫారం 2021 ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ ని నింపి ఇచ్చిన చిరునామాకి ఆఖరి తేదీ లోపే పంపాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే..? అభ్యర్థుల వయసు 18-27 మాత్రమే ఉండాలి. ఇక ఇందులో సెలెక్ట్ అయ్యిన వాళ్ళ జీతం రూ. 29,200 నుండి రూ. 92,300 ఉంటుంది.
సంస్థ పేరు: కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG)
పోస్ట్ పేరు: ఆడిటర్, అకౌంటెంట్
మొత్తం ఖాళీలు: 10811 పోస్టులు
ముగింపు తేదీ: 19 ఫిబ్రవరి 2021
వర్గం : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
భారతదేశం అంతటా ఉద్యోగ స్థానం
అధికారిక సైట్: cag.gov.in
అప్లికేషన్ ని పంపాల్సిన చిరునామా: Shri V S Venkatanathan, Asstt. C & AG(N), O/o the C&AG of India, 9, Deen Daya; Upadhya Marg, New Delhi – 110124