నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐసీ Hyderabad ESIC job notification జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనితో ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పైగా ఆనలైన్ లోనే ఈ పోస్టులకి అప్లై చెయ్యాలి. పోస్టల్ ద్వారా ఏమి పంపాల్సిన అవసరం లేదు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది అని నోటిఫికేషన్ లో తెలిపారు. ఇక ఈ ఉద్యోగాలకి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..
భారత ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ సనత్ నగర్ లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) ఉద్యోగాలని భర్తీ చేస్తోంది. దీనిలో మొత్తం 237 ఖాళీలు ఉన్నాయని వెల్లడించింది. ఈ పోస్టుకి అప్లై చెయ్యాలంటే ఈజీగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అప్లై చెయ్యడానికి ఆగస్టు 20 చివరి తేది.
ఇక పోస్టుల వివరాలలోకి వెళితే.. మొత్తం ఖాళీలు 237 వున్నాయి. ఫ్యాకల్టీ – 53, సూపర్ స్పెషలిస్ట్ – 24, సీనియర్ రెసిడెంట్ – 124, జూనియర్ రెసిడెంట్ – 36. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు. https://www.esic.nic.in/recruitments వెబ్‌సైట్ లో అభ్యర్థులు పూర్తి వివరాలని చూడొచ్చు.