డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లపై వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉంటుంది? తాజా అధ్యయనం ఏం చెబుతుంది?

-

కరోనా వేరియంట్లలో డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించబడింది. వేగంగా విస్తరించడంతో పాటు ఎక్కువ ప్రభావం చూపే వేరియంట్ గా గుర్తించారు. ఐతే ఈ వేరియంట్ పై కరోనా వ్యాక్సిన్ల ప్రభావం ఎలా ఉంటుందనే విషయంలో చాలా రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. ప్రస్తుతానికి ప్రపంచంలోని కొన్ని వ్యాక్సిన్లు, మోడెర్నా, స్పుతిక్-వి, ఫైజర్ మొదలగునవి డెల్టా వేరియంట్ పై ప్రభావాన్ని చూపుతున్నాయని వెల్లడించారు.

ఇదిలా ఉంటే భారతదేశంలోని రెండు వ్యాక్సిన్లపై ఐసీఎమ్ఆర్ పరిశోధన చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. భారత్ బయోటెక్ రూపొందించిన కోవ్యాక్సిన్, డెల్టా ప్లస్ వేరియంట్ పై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. అలాగే కోవిషీల్డ్ విషయంలో ఆల్రెడీ కోవిడ్ వచ్చి రికవరీ అయ్యాక రెండు డోసులు తీసుకున్నవారిలో డెల్టా ప్లస్ మీద వ్యాక్సిన్ ప్రభావం విపరీతంగా ఉంటుందని, మెరుగ్గా పనిచేస్తుందని తెలిపారు. వేరియంట్ కి వ్యతిరేకంగా హార్మోన్లని ప్రేరేపించి, రోగనిరోధక శక్తిని ప్రతిస్పందించచేయడంలో కోవిషీల్డ్ బాగా పనిచేస్తుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news