కేంద్ర ఎకనమిక్/స్టాటిస్టికల్ సర్వీస్లుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నిర్వహించే ఐఈఎస్ /ఐఎస్ఎస్-2019 నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు- 65
-ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఐఎస్‌ఎస్)-33
-ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ (ఐఈఎస్)-32
వయస్సు: 2019 ఆగస్టు 1 నాటికి 21-30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
అర్హతలు: ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ పోస్టులకు స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/అప్లయిడ్ స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ/ పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ పోస్టు-లకు మాస్టర్ డిగ్రీ (ఎకనమిక్స్, అప్లయిడ్ ఎకనమిక్స్, బిజినెస్ ఎకనమిక్స్, ఎకనామెట్రిక్స్)లో ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రెండు దశల్లో రాతపరీక్ష (పార్ట్1), ఇంటర్వ్యూ/వైవా వాయిస్ (పార్ట్2) ద్వారా చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఏప్రిల్ 16
ఫీజు: రూ. 200/-
(ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు)
పరీక్షతేదీ: జూన్ 28
వెబ్‌సైట్: https://upsconline.nic.in
– కేశవ