గుడ్ న్యూస్.. భారత్ డైనమిక్స్ లో ఉద్యోగాలు..!

-

ఉద్యోగం కోసం మీరు చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితో ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

భారత్ డైనమిక్స్ / BDL
భారత్ డైనమిక్స్ / BDL

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. జులై 19 లోగా అప్లై చేసుకోవాలి అని నోటిఫికేషన్లో చెప్పారు.

అభ్యర్థులు అప్లై చేసే సమయంలో రూ. 500లను పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది, అభ్యర్థులు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, PwD, అంతర్గత ఉద్యోగులకు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఇచ్చారు.

ఇక పోస్టుల విరాళ లోకి వెళితే.. దీనిలో మొత్తం 46 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇందులో జనరల్ మేనేజర్(HR)-1, డిప్యూటీ జనరల్ మేనేజర్ (న్యూ ప్రాజెక్ట్స్)-3, మెడికల్ ఆఫీసర్ – 2, అసిస్టెంట్ మేనేజర్(సేఫ్టీ) – 3, MT(మెకానికల్)-9, MT(ఎలక్ట్రికల్)-3 వున్నాయి.

అలానే MT(సివిల్)-3, MT(కంప్యూటర్ సైన్స్) -2, MT (Optics) – 1, MT (బిజినెస్ డెవెలప్మెంట్) – 1, MT(HR) విభాగంలో 3 ఖాళీలు ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు వున్నాయి గమనించండి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. https://bdl-india.in/sites/default/files/2021-06/Advertisement%202021-2_29.06.pdf

Read more RELATED
Recommended to you

Latest news