UMANG APP : ఉమాంగ్ యాప్‌ నుండి పీఎఫ్ డబ్బులు ఇలా ఈజీగా డ్రా చేయండి..!

-

ఉమాంగ్ యాప్‌ (UMANG APP) నుండి పీఎఫ్ డబ్బులు ఇలా ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉండి.. ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చెయ్యాలని అనుకుంటే ఇలా చెయ్యచ్చు.

 ఉమాంగ్ యాప్‌ /UMANG APP
ఉమాంగ్ యాప్‌ /UMANG APP

UMANG యాప్‌లో అనేక ప్రభుత్వ సేవలు లభిస్తాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO అందించే సేవల్ని కూడా ఉమాంగ్ యాప్‌లో పొందొచ్చు.

ప్రభుత్వానికి చెందిన అన్ని సేవల్ని ఒకే ప్లాట్‌ఫామ్‌పై ఉండాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ కలిసి ‘యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్-UMANGAPP‘ పేరుతో ఈ యాప్ ని స్టార్ట్ చేయడం జరిగింది.

ఈపీఎఫ్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ నుంచి పీఎఫ్ విత్‌డ్రాయల్ వరకు అన్నీ ఈ యాప్ ద్వారా మనం చేసుకో వచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.

ఉమాంగ్ యాప్‌ లో ఈపీఎఫ్ డబ్బులు డ్రా చేయడానికి ఇలా చెయ్యండి:

ఫస్ట్ గూగుల్ ప్లేస్టోర్‌లో ఉమాంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
నెక్స్ట్ యాప్ ఓపెన్ చేసి మీ వివరాలతో లాగిన్ అవ్వాలి.
ఆ తర్వాత EPFO సెక్షన్‌ లోకి వెళ్లాలి.
ఇప్పుడు Employee Centric సర్వీసెస్‌లో క్లెయిమ్ ఆప్షన్ ని ఓపెన్ చెయ్యండి. కోవిడ్ 19 అడ్వాన్స్ తీసుకోవాలనుకుంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ జనరేట్ చేయాలి.
ఇప్పుడు మీ పీఎఫ్ అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌ కి ఓటీపీ వస్తుంది.
ఇప్పుడు మీరు ఆ ఓటీపీ ఎంటర్ చెయ్యాలి.
తర్వాత విత్‌డ్రాయల్ టైప్ సెలెక్ట్ చేయాలి.
హెల్త్, మ్యారేజ్ లాంటి వాటిలో మీ కారణాన్ని సెలెక్ట్ చేయాలి.
ఇప్పుడు మీరు రిక్వెస్ట్ సబ్మిట్ చేయాలి.
క్లెయిమ్ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దీనితో మీరు విత్డ్రాయల్ స్టేటస్ ట్రాక్ చేయొచ్చు అంతే .

పాస్‌బుక్ డౌన్‌లోడ్ కోసం ఇలా చెయ్యండి:

ఉమాంగ్ యాప్‌లో లాగిన్ అయిన తర్వాత EPFO సెక్షన్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత Employee Centric సర్వీసెస్‌లో View Passbook ఫైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ జనరేట్ చేయాలి. నెక్స్ట్ మీ పీఎఫ్ అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఫైనల్ గా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈపీఎఫ్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేయొచ్చు అంతే.

Read more RELATED
Recommended to you

Latest news