బోధ్‌గయలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన బోధ్‌గయ లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ లో కొన్ని ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. బోధ్‌గయ లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ లో ఎస్టేట్‌ కమ్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, రిసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఇక మరి ఈ పోస్టులకి అప్లై చేసుకునేందుకు ఎవరు అర్హులు అన్నది చూస్తే.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌, ఎంబీఏ, ఎమ్‌కాం, ప్రోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవాళ్లు అప్లై చేయచ్చు.

కనీసం 55 శాతం మార్కుల తో ప్యాస్ అయితే సరిపోతుంది. అంతే కాక ఏడాది నుంచి 15 ఏళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే వయస్సు తప్పకుండా 30 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక ఎలా ఎంపిక చేస్తారు అనేది చూస్తే షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి డిసెంబర్‌ 6, 2022 ఆఖరి తేదీ. https://iimbg.ac.in/careers/ లో పూర్తి వివరాలను చూసి అప్లై చేసుకోవచ్చు.