కియా మోటార్స్‌లో ఉద్యోగాలు… వివరాలు ఇవే..!

-

నిరుద్యోగులకు శుభవార్త. కియా మోటార్స్‌లో ఉద్యోగాలు వున్నాయి. ఇప్పుడే వివరాలని చూసేయండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC ట్విట్టర్ ‌లో చెప్పిన దాని ప్రకారం అనంతపురం జిల్లా పెనుకొండలోని కియా మోటార్స్‌లో ఉద్యోగాల భర్తీ జరుగుతోంది అని తెలుస్తోంది. అలానే పలు వివరాలని కూడా షేర్ చేసారు.

 

ఇక వాటి గురించి చూస్తే.. కియా మోటార్స్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ద్వారా నీమ్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం ఇందులో 200 ఖాళీలు ఉన్నాయి. ఫ్రెషర్స్ ‌తో పాటు అనుభవం ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. అర్హత, ఆసక్తి ఉంటే అప్లై చెయ్యొచ్చు. విద్యార్హతల వివరాలు చూస్తే ఏదైనా బ్రాంచ్‌లో డిప్లొమా పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు.

2016 నుంచి 2020 మధ్య పాస్ అయిన అభ్యర్థులే దరఖాస్తు చేయాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఎంపికైన వారికి రూ.14,000 నుంచి రూ.15,000 వరకు వేతనం లభిస్తుంది.

అభ్యర్థులు 2021 మార్చి 30న జరిగే ఆన్‌లైన్ ఎగ్జామ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలని అధికారిక వెబ్‌సైట్ https://www.apssdc.in/ లో తెలుసుకోవచ్చు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభ్యర్థులు శ్రీకాకుళం జిల్లాలో జరిగే డ్రైవ్‌కు, తూర్పుగోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లాల అభ్యర్థులు విశాఖపట్నంలో జరిగే డ్రైవ్‌కు హాజరు కావాలి.

Read more RELATED
Recommended to you

Latest news