సైనిక్ స్కూల్ లో ఉద్యోగాలు.. వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. సైనిక్ స్కూల్, చిత్తోర్‌ఘర్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోచ్చు. ఈ మేరకు నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలని చూస్తే..

jobs
jobs

TGTతో పాటు ఇతర ఖాళీలను భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్ లో చెప్పింది. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. టీజీటీ 2, జనరల్ ఎంప్లాయిస్ 17, PEM/PTI-Cum-Matron 1. సంస్థ అధికారిక వెబ్ సైట్ sschittorgarh.comలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టీజీటీ పోస్టుల గురించి చూస్తే.. మాథ్స్ సబ్జెక్టుకు సంబంధించి ఒకటి, సైన్స్ కు సంబంధించి ఒకటి వుంది.

సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసుండాలి. 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. బీఈడీ కూడా పూర్తి చేసుండాలి. CTET క్వాలిఫై అయి ఉండాలి. ఐదేళ్ల పాటు టీచింగ్ అర్హత ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.44,900 వేతనం ఇస్తారు.

అలానే జనరల్ ఎంప్లాయిస్ పోస్టులకి అయితే స్టేట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి టెన్త్ విద్యార్హత కలిగి ఉండాలి. ఐదేళ్ల అనుభవం ఉండాలి. మొత్తం 17 ఖాళీలను భర్తీ చేస్తుండగా కాంట్రాక్ట్ విధానంలో 14, రెగ్యులర్ విభాగం లో 3 ఖాళీలు ఉన్నాయి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డెమో ఇచ్చి షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళ వివరాలను స్కూల్ వెబ్ సైట్లో పెడతారు. ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. https://www.sschittorgarh.com/index.php

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news