యూపీఎస్సీలో ఉద్యోగాలు.. వివరాలు ఇవే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC ప‌లు పోస్టులని భర్తీ చేస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

upsc

ఇందులో డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, ప్రైవేటు సెక్ర‌ట‌రీ, సీనియ‌ర్ గ్రేడ్ మొదలైన విభాగాల్లో 56 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అభ్య‌ర్థుల వ‌య‌సు గ‌రిష్టంగా 30 ఏళ్ల నుంచి 35 ఏళ్లు ఉండాలి. అలానే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనేందుకు అక్టోబ‌ర్ 28, 2021 ఆఖరి తేదీ. కనుక ఆసక్తి వున్న వాళ్లు ఈ లోగా అప్లై చేసుకోండి.

రిక్రూట్‌మెంట్ టెస్ట్‌ , ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఆయా పోస్టుల‌ను అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల‌లో ఇంజ‌నీరింగ్ డిగ్రీ, మాస్ట‌ర్ డిగ్రీ పాసై ఉండాలి. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే… డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ – 01, ప్రైవేటు సెక్ర‌ట‌రీ – 01, సీనియ‌ర్ గ్రేడ్ – 20, జూనియ‌ర్ టైం స్కేల్ – 29, యూత్ ఆఫీస‌ర్ – 05. ‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా ఉంటుంది. నోటిఫికేషన్ ని చూసి మీరు అర్హులైతే అప్లై చేసుకోండి. నోటిఫికేష‌న్‌కు సంబంధించి వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/ ను సంద‌ర్శించాలి. అలానే https://www.upsconline.nic.in/ లింక్ ద్వారా అప్లై చేసుకోండి.

 

Read more RELATED
Recommended to you

Latest news