బీహెచ్ఈఎల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…!

-

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) తాజాగా నోటిఫికేషన్ ని విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ వున్నాయి. మరి ఆ వివరాలని ఇప్పుడే చూసేయండి.

 

ఇక పోస్టుల వివరాలని చూస్తే.. సూపర్వైజర్ ట్రైనీ విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత వున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 40 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. UR విభాగంలో 25 పోస్టులు, EWS విభాగంలో 2 పోస్టులు, OBC విభాగంలో 10 పోస్టులు, ఎస్సీలకు రెండు, ఎస్టీలకు మరో పోస్టును రిజర్వ్ చేశారు.

అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. బ్యాచలర్ ఆఫ్ కామర్స్(B.Com) చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అప్లికేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 05న ప్రారంభం కానుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 26లోగా అప్లై చేసుకోవాలి. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఏప్రిల్ 23న ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. career.bhel.in వెబ్ సైట్ లో ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అలానే అక్కడ పూర్తి వివరాలు కూడా ఉంటాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news