ఎన్‌టీపీసీ లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చెయ్యండి..!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తాజాగా భారత ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అర్హులు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 22 పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆగస్టు 6 దరఖాస్తులకు చివరి తేది. ఇక పోస్టుల వివరాలలోకి వెళితే.. దీనిలో మొత్తం పోస్టులు 22, ఎగ్జిక్యూటివ్‌ (కమర్షియల్‌) – 14,
ఎగ్జిక్యూటివ్‌ (కన్సల్టెన్సీ) – 03 , ఎగ్జిక్యూటివ్‌ (బిజినెస్‌ అనలిస్ట్‌) – 01, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (సోలార్‌)– 01.

సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (కంపెనీ సెక్రటరీ)– 01, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌)– 01, ఎగ్జిక్యూటివ్‌ (క్లీన్‌ టెక్నాలజీస్‌)– 01. ఇక అర్హత విషయం లోకి వస్తే… పోస్టులను బట్టి బ్యాచిలర్స్‌ డిగ్రీ /బీఈ /బీటెక్‌, ఎంబీఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి వివరాలని http://ntpc.co.in/ వెబ్‌సైట్‌ లో చూడొచ్చు.