ఉత్తరప్రదేశ్: లక్నో-అయోధ్య జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డబుల్ డెక్కర్ బస్సును ట్రక్టు ఢీకొట్టింది. ఈ ఘటనలో 18 మంది దుర్మరణం చెందగా మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు నిర్వహిస్తున్నారు. బరాబంకి జిల్లా రాంస్నేహిఘాట్ వద్ద అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.
రిపేర్ రావడంతో డ్రైవర్ రోడ్డు పక్కన డబుల్ డెక్కర్ బస్సును నిలిపారు. అదే సమయంలో ఓ ట్రక్కు అతివేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. బస్సులో చాలా మంది నిద్రలో ఉండగా మరికొంతమంది కిందకు దిగి రోడ్డుపై నిల్చున్నారు. ఈ సమయంలో ప్రమాదం జరగడంతో బస్సులు నిద్రిస్తున్న వారు ఎక్కువగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్కు డ్రైవర్‌కు కూడా గాయాలయినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాద ఘటనపై ఉత్తరప్రదేశ్ దిగ్బ్రాంతికి గురైంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ప్రకటించింది.