ఫ్లాప్ డైరెక్టర్ తో నాని ఫ్యామిలీ ఎంటర్ టైనర్

-

ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఫుల్ టైం ఫామిలీ ఎంటర్ టైనర్ కి నాని ఓకే చెప్పినట్లు టాక్. శ్రీకాంత్ అడ్డాల చివరగా మహేష్ తో బ్రహ్మోత్సవం చేశారు. ఇది డిజాస్టర్ ని చవిచూసిన విషయం విదితమే.

నాని ఈ తరం హీరో అయినా పాత తరం హీరో లాగ ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. 2016లో కృష్ణగాడి వీరప్రేమ గాథ, జెంటిల్ మెన్, మజ్ను, 2017లో నేను లోకల్, నిన్ను కోరి, ఎంసీఏ లతో డబుల్ హ్యాట్రిక్ ని అందుకున్నారు. గతేడాది కృష్ణార్జున్ యుద్ధం, దేవదాస్ లతో మెప్పించారు.

Nani family entertainer movie with flop director

ఇటీవల జెర్సీతో కెరీర్ బెస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సినిమాల విషయంలో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో గ్యాంగ్ లీడర్ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రమిది. దీంతోపాటు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వీ పేరుతో మల్టీస్టారర్ చేస్తున్నారు. సుధీర్ బాబు మరో హీరో. అతిధి రావు హైదరి హీరోయిన్లు. ఇది రీసెంట్ గానే ప్రారంభమైనది.

తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఫామిలీ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఫుల్ టైం ఫామిలీ ఎంటర్ టైనర్ కి ఓకే చెప్పినట్లు టాక్. శ్రీకాంత్ అడ్డాల చివరగా మహేష్ తో బ్రహ్మోత్సవం చేశారు. ఇది డిజాస్టర్ ని చవిచూసిన విషయం విదితమే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్నారు. ఈ ఏడాది సెకండాఫ్ లో షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news