POLYCET 2019 : నోటిఫికేషన్‌ విడుదల

-

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్‌స టెస్ట్ (పాలీసెట్) నోటిఫికేషన్‌ను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ విడుదల చేసింది.

పాలీసెట్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్స్/కాలేజీల్లో ఇంజినీరింగ్ డిప్లొమాల్లో ప్రవేశాల కోసం ఈ ఎంట్రెన్స్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తారు. పదోతరగతి తర్వాత నేరుగా ఇంజినీరింగ్ డిప్లొమా చదవడం వల్ల తొందరగా ఉద్యోగాల్లో చేరాలనుకునేవారికి ఇదొక మంచి అవకాశం, అదేవిధంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఎక్కువగా వస్తుంది.

PolyCET 2019 Notification Released
PolyCET 2019 Notification Released

తర్వాత ఉన్నత చదువులు అంటే బీఈ/బీటెక్ రెండో సంవత్సరంలోకి ప్రవేశం తీసుకోవచ్చు (లేటరల్ ఎంట్రీ ద్వారా). లేదా రాష్ట్ర, కేంద్ర, ప్రైవేట్‌సంస్థల్లో పాలిటెక్నిక్ డిప్లొమా ద్వారా ఉద్యోగాలు పొందవచ్చు.

అర్హతలు

పదోతరగతి ఉత్తీర్ణులు లేదా ఈ ఏడాది మార్చిలో పదోతరగతి పరీక్షలు రాస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సులు

సివిల్, కంప్యూటర్, ఆటోమొబైల్, ఆర్కిటెక్చరల్, ఈసీఈ, ఈఈఈ, కెమికల్, ఐటీ, మెకానికల్, మైనింగ్,ప్యాకింగ్, ప్రింటింగ్, హోంసైన్స్, గార్మెంట్ టెక్నాలజీ, క్రాఫ్ట్ టెక్నాలజీ, బయోమెడికల్, మెటలర్జీ, లెదర్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్ ఇంజినీరింగ్‌తోపాటు మరికొన్ని కోర్సులు ఉన్నాయి.

ప్రవేశాలు ఎలా కల్పిస్తారు

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పాలీసెట్‌లో వచ్చిన ర్యాంక్, అభ్యర్థి ఇచ్చి ప్రాధ్యానతల ఆధారంగా చేస్తారు.

పరీక్ష విధానం

– మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల విధానంలో నిర్వహిస్తారు.
– 120 ప్రశ్నలు. 2 గంటలు (120 నిమిషాల్లో) పరీక్ష రాయాలి.
– సబ్జెక్టుల వారీగా మ్యాథ్స్ -60, ఫిజిక్స్-30, కెమిస్ట్రీ-30 ప్రశ్నల చొప్పున ఇస్తారు.
– ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
– ప్రతి ప్రశ్నకు ఒకమార్కు. నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఏప్రిల్ 4
ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.250/- ఇతరులకు రూ.400/-
పాలీసెట్ తేదీ: ఏప్రిల్ 16
ఫలితాల వెల్లడి: ఏప్రిల్ 24
పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: https://polycetts.nic.in

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news