మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా కీలక ప్రకటన చేసింది. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(CGL) పరీక్షకు సంబంధించిన ప్రకటన చేసింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ని గ్రూప్-బీ, గ్రూప్-సీ విభాగంలోని ఖాళీలను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. 23 విభాగాల్లోని ఉద్యోగాలకు విద్యార్హతలను వేర్వేరుగా నిర్ణయించారు. వయస్సు వచ్చేసి 18 నుంచి 32 ఏళ్లు ఉండాలి.
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫసీర్, అసిస్టెంట్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్ కమ్ ట్యాక్స్, ఇన్స్పెక్టర్ (CGST&Central Excise), ఇన్స్పెక్టర్(ప్రెవెంటీవ్ ఆఫీసర్), ఇన్స్పెక్టర్(ఎగ్జామినర్), అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ పోస్టులు, అసిస్టెంట్/సూపరింటెండ్, రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్(JSO), స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2, ఆడిటర్, అకౌంటెంట్/జూనియర్ అకౌంటెంట్,
సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/అప్పర్ డివిజన్ క్లర్క్స్ పోస్టులని భర్తీ చేస్తున్నారు.
డిసెంబర్ 23, 2021 న దరఖాస్తులు ప్రారంభం అవ్వగా.. అప్లై చెయ్యడానికి ఆఖరి తేదీ జనవర్ 23, 2022. ఆన్లైన్ ఫీజు చెల్లించడానికి ఆఖరి తేదీ జనవరి 25, 2022. ఆఫ్ లైన్ చలానా జనరేట్ చేయడానికి ఆఖరీ తేదీ జనవరి 26, 2022.
అప్లికేషన్ కరెక్షన్ విండో ఓపెన్ అయ్యే తేదీ 28 జనవరి, 2022. అర్హత వివరాలని నోటిఫికేషన్ లో చూడచ్చు. అభ్యర్థులు రూ.100ను ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు https://ssc.nic.in/ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.