NID లో టీచర్ పోస్టులు…రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ లో కొన్ని ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ లో టీచింగ్ పోస్టులు వున్నాయి. అందుకే ఈ మేరకు నోటిఫికేషన్ ని విడుదల చేసారు.

మొత్తం దీనిలో 17 ఖాళీలు వున్నాయి. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. ప్రిన్సిపల్‌ డిజైనర్‌, సీనియర్‌ ఫ్యాకల్టీ, అసోసియేట్‌ ఫ్యాకల్టీ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత విషయానికి వస్తే.. ఈ పోస్టులకి అప్లై చేయాలని అనుకునే వాళ్ళు పోస్టులని బట్టీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ లో వున్న ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయస్సు 45 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

ఇక ఎలా ఎంపిక చేస్తారనేది చూస్తే.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. కానీ ఎలాంటి రాత పరీక్ష ఉండదు. దరఖాస్తు ఫీజుగా రూ. 500 చెల్లించాల్సి వుంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి 19-12-2022ని చివరి తేదీ. పూర్తి వివరాలను https://nidmp.ac.in/recruitment.php లో చూసి అప్లై చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news