Acharya big update : ఆచార్య మూవీ నుండి “భలే భలే బంజారా” ఫుల్ సాంగ్ రిలీజ్..

-

టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ‘ఆచార్య”. మెగాస్టార్ చిరంజీవి- మె గా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా కోసం మెగా అభిమానులే కాదు సినీ లవర్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తు్న్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ మూవీపై అంచనాలను ఇంకా పెంచేసింది.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్.

డెఫినెట్ గా రికార్డులన్నిటినీ తిరగ రాస్తుందని సినీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తండ్రీ తనయులు చిరు-చెర్రీలను వెండితెరపైన చూసి మెగా అభిమానులు సంబురాలు చేసుకోనున్నారు.అయితే తాజాగా ఈ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం.ఆచార్య సినిమాలోని “భలే భలే బంజారా ” అంటూ సాగే పాటను విడుదల చేసింది.ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తో కలిసి వేసే స్టెప్పులు చూస్తుంటే వయస్సు అనేది ఒక సంఖ్య మాత్రమే అనడానికి చిరంజీవి నిదర్శనం అన్నట్టుగా ఉంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా..సింగర్లుగా శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను ఆలపించారు.రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.డాన్స్ ని శేఖర్ మాస్టర్ అందించారు.ఈ పాటను నేడు సాయంత్రం 04: 5 నిమిషాలకు విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించినా కొన్ని సాంకేతిక కారణాల వల్ల కాస్త ఆలస్యమైంది.

Read more RELATED
Recommended to you

Latest news