తెలంగాణ ఐసెట్ 2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ షెడ్యూలను సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ విడుదల చేశారు. ఈసారి రెండు విడతల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుందని తెలిపారు. మొదటి విడత కౌన్సెలింగ్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం అవుతుందని వెల్లడించారు. రెండో విడత అదే నెల 23న ప్రారంభం కానునట్లు వివరించారు.
అక్టోబరు 10 నుంచి 13 వరకు జరగనున్న ధ్రువపత్రాల పరిశీలనకు 8 నుంచి 12 వరకు స్లాట్‌బుకింగ్ చేసుకోవాలని నవీన్ మిత్తల్ సూచించారు. అక్టోబరు10 నుంచి 15 వరకు కోర్సులు, కాలేజీల వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అక్టోబరు 18న ఎంబీఏ, ఎంసీఏ తొలి విడత సీట్ల కేటాయిమని సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిత్తల్ వెల్లడించారు. అక్టోబరు 18 నుంచి 21 వరకు సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయాలని పేర్కొన్నారు. తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు 23న ప్రారంభం కానుందని వివరించారు. అక్టోబరు 28న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు చెప్పారు.