ఇవాళ 10 గంటలకు GHMC కౌన్సిల్ మీటింగ్..

-

ఇవాళ 10 గంటలకు GHMC కౌన్సిల్ మీటింగ్ జరుగనుంది. అయితే.. ఈ కొత్త పాలక మండలి వచ్చాక అసెంబ్లీ సమావేశాలను కౌన్సిల్ మీటింగ్ తలపిస్తున్నాయి. గత రెండు సమావేశాల్లో TRS వర్సెస్ బీజేపీ అన్నట్లు నడిచింది. TRS, బీజేపీ ఒకరి పై ఒకరు ఆరోపణ లు చేసుకోవడంతో అర్దాంతరంగా గత రెండు బల్దియా సమావేశాలు ముగిశాయి.

గతంలో ఏప్రిల్ 12 న జరిగిన బల్దియా కౌన్సిల్ మీటింగ్ జరుగగా… గత సమావేశం తర్వాత పార్టీలు మారారు ఐదుగురు కార్పొరేటర్లు. ఇటీవల TRS నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన విజయారెడ్డి… విజయారెడ్డి చేరికతో నాలుగుకు పెరిగింది కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య. అటు నలుగురు బీజేపీ కార్పొరేటర్లు…కారు ఎక్కారు.

ప్రస్తుతం బల్దియాలో పార్టీల బలాబలాలు.. TRS 59, MIM 44, బీజేపీ 43, కాంగ్రెస్ 4 గా ఉంది. GHMC కౌన్సిల్ మీటింగ్ రెండు రోజులు నిర్వహి0చాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నారు. ప్రజా సమస్యలు కోసం అయితేనే బల్దియా మీటింగ్ పెట్టండి, TRS  బీజేపీ గొడవల కోసం అయితే కౌన్సిల్ మీటింగ్ ను కాంగ్రెస్ వద్దు అంటుంటే… కౌన్సిల్ మీటింగ్ ను బీజేపీ వాడుకుంటుదంటుంది TRS. దీంతో ఇవాళ జరిగే బల్దియా సమావేశం పై రాజకీయ పార్టీల్లో ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news