హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ లో ఖాళీలు… వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ గుడ్ న్యూస్ చెప్పింది. హెచ్‌ఏఎల్‌ బెంగళూరులోని సంస్థలో వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పోస్టుల వివరాల లోకి వెళియే.. స్టాఫ్‌ నర్స్‌, ఫిజియోథెరపిస్ట్‌, ఫార్మసిస్ట్‌, డ్రెస్సర్‌ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

వయస్సు వచ్చేసి 28 సంవత్సరాల లోపు ఉండాలి. జనరల్‌ నర్సింగ్, మెడ్‌వైఫరీలో డిప్లొమా పాసైన వాళ్లు స్టాఫ్ నర్స్ పోస్టుకు అర్హులు. ఫిజియోథెరపీలో డిప్లొమా పూర్తి చేసిన వాళ్లు ఫిజియోథెరపిస్ట్‌ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. అలానే డీఫార్మసీ పూర్తి చేసిన వాళ్లు ఫార్మసిస్ట్‌ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

డ్రెస్స్ర్ ఉద్యోగ ఖాళీల కోసం ప్రథమ చికిత్స విభాగంలో ట్రైనింగ్ పూర్తి చేసిన వారు అర్హులు. రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక జరగనుంది. ఎంపికైన వాళ్లకి 15000 రూపాయల నుంచి 21,473 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. https://hal-india.co.in/careers/m__206 వెబ్ సైట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version