జ‌య‌ల‌లిత బ‌యోపిక్ నుంచి త‌ప్పుకున్న బాల‌కృష్ణ‌..

-

బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ఇప్పుడు అన్ని ఇండ‌స్ట్రీల్లో బ‌యోపిక్ ల ప‌ర్వం కొన‌సాగుతోంది. బాలీవుడ్ లో బాగ్ మిల్కా బాగ్ చిత్రంతో మొద‌లైన ఈ ట్రెండ్ టాలీవుడ్ లో మొన్న‌టి మ‌హాన‌టి సినిమా వ‌ర‌కు స‌క్సెస్ ఫుల్ గా సాగింది. దీంతో బ‌యోపిక్ ల‌ను తీయాడానికి చాలా మంది నిర్మాత‌లు ఇంట్రెస్ట్ క‌న‌బ‌రుస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవ‌లో వ‌స్తున్న మ‌రో సినిమా త‌లైవి. దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవిత‌క‌థ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రాన్ని ఎ.ఎల్. విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా ప్ర‌ధాన‌పాత్ర‌లో కంగ‌నా ర‌నౌత్ న‌టిస్తోంది. ఇంకా ఈ సినిమాలో అర‌వింద్ స్వామి, ప్ర‌కాశ్ రాజ్ ఇత‌ర ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఇదిలా ఉంటే జ‌య‌ల‌లిత సినిమా జీవితంలో ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంటుంద‌న్న విషయం అంద‌రికి తెలిసిందే. వీరిద్ద‌రూ క‌లిసి తెలుగులో చాలా సినిమాల్లో న‌టించారు. దీంతో ఈ పాత్ర‌ను బాల‌కృష్ణ తో చేయిస్తే బాగుంటుందని చిత్ర నిర్మాత‌ విష్ణు ఇందూరి అనుకున్నాడు. పైగా ఆయ‌న ఇదివ‌ర‌కే బాల‌కృష్ణ తో ఎన్టీఆర్ బ‌యోపిక్ ను తీసారు. బాల‌కృష్ణతో ఉన్న సాన్నిహిత్యంతో ఎన్టీఆర్ పాత్ర చేసేందుకు ఆయన సంప్ర‌దించాడ‌ని స‌మాచారం.

అయితే ఇదివ‌ర‌కే త‌న తండ్రి బ‌యోపిక్ సినిమాలు క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు తీసి విఫ‌ల‌మైన బాల‌కృష్ణ  ఈ ఆఫ‌ర్ ను సున్నితంగా తిర‌స్క‌రించాడు. దీంతో జ‌య‌ల‌లిత బ‌యోపిక్ లో ఎన్టీఆర్ పాత్ర‌ను వేరే వారితో చేస్తారో లేక సినిమా నుండి తొల‌గిస్తారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news