వ్యవసాయ చట్టాలతో రైతులపై దాడి..హాథ్రాస్‌ ఘటనపై మోడీ స్పందించకపోవడం దారుణం : రాహుల్‌

-

మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవయసాయ చట్టాలను రైతులపై దాడిగా అభివర్ణించారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ..పంజాబ్‌లో రైతు ర్యాలీలో పాల్గొన్న రాహుల్ మీడియాతో మాట్లాడుతూ..ప్రస్తుతం మోడీ తీసుకువచ్చిన అగ్రి చట్టాలు ఆహార భద్రతను నాశనం చేయడానికి ఒక మార్గం అవుతుందన్నారు.. ఇది దేశంలో రైతులపై ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుందని, ఇది మన రైతులపై దాడి అని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్లమెంట్‌లో అగ్రిబిల్లులు పెట్టినప్పుడు సోనియా గాంధీ మెడికల్ చెక్-అప్ కోసం ఇతర దేశాలకు వెళ్ళిందని..తన సోదరి ప్రియాంక గాంధీ సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో సోనియా గాంధీతో వెళ్ళలేకపోయిందన్నారు. అందువల్ల నేను నా తల్లితో కలిసి వెళ్లవలసి వచ్చిందని, నా తల్లిని చూసుకోవల్సిన బాధ్యత ఒక కొడుకుగా నాపై ఉందన్నారు.
రాహుల్ గాంధీ హత్రాస్‌కేస్‌పై మాట్లాడుతూ..హత్రాస్‌ యువతి ఘటనపై బాధితురాలి కుటుంబంకు మద్ధతుగా నిలవాలని, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని అక్కడికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించామన్నారు..బాధిత కుటుంబాన్ని ఉత్తర ప్రదేశ్ పరిపాలన లక్ష్యంగా చేసుకుంది దీనిపై ప్రధాని మోడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.
లాక్డౌన్ సమయంలో కార్మికుల దుస్థితిపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ..దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండి, కార్మికులకు ఉపాధిని కల్పించిన చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలు లాక్డౌన్ సమయంలో మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో నాశనం చేశారన్నారు..నేను ఫిబ్రవరిలోనే కరోనా తీవ్రత గురించి హెచ్చరించాను కాని వారు నేను హాస్యమాడుతున్నానని నా మాటలకు వారు ప్రధాన్యత ఇవ్వలేదని ఇప్సుడు దేశంలో కరోనా రోజురోజుకు పెరుగుతుందని కేంద్ర నిర్ణయాలే ఈ దుస్తుతికి కారణమన్నారు రాహుల్.

Read more RELATED
Recommended to you

Latest news