అనుకూలించని పరిస్దితులు.. ముంబై నగరంలో 144 సెక్షన్‌ విధించిన అధికారులు.. ?

ఒకవైపు కరోనా, మరోవైపు ప్రకృతి వైపరిత్యాలు.. దేశాన్ని జలగలా పట్టి పీడిస్తున్నాయి.. అసలు ఈ సంవత్సరమే ప్రజలందరితో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుతున్నట్లుగా ఉంది.. ఎందుకంటే సంవత్సరం పొడవునా ఏదో ఒక విపత్తు దేశం పై, దేశంలోని ప్రజలపై విరుచుకు పడుతున్నాయి.. లాక్‌డౌన్ వల్ల అయినా పరిస్దితులు కాస్త కుదుటపడతాయని భావించిన వారికి నిరాశే మిగిలింది.. ఇక మొన్నటి వరకు వేసవి అంటే ఇది అంటూ నిప్పులు కురిపించిన సూర్యుడు ఇప్పుడు కాస్త చల్లబడగానే, తుఫానులు బయలు దేరాయి..

ఇక కరోనా తర్వాత భరించలేని ఎండలు, ఇప్పుడు ఈ సంవత్సరం మొట్టమొదటి తుఫాను నిసర్గ తమ తమ పరిధిమేర ప్రతాపాన్ని చూపిస్తున్నాయి.. ప్రస్తుతం అయితే మహరాష్ట్ర తీరాన్ని నిసర్గ తుపాను తాకనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో బ్రిహాన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అప్రమత్తమై కొన్ని నిషేధాజ్ఞలు జారీ చేసింది.. ఈ నేపధ్యంలో తుపాను తీవ్రత గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల పెనువేగంతో తరుముకొస్తున్న తరుణంలో, ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించుకునేందుకు నగరంలో 144 సెక్షన్‌ విధించినట్లు గ్రేటర్‌ ముంబై పోలీస్‌ కమిషనర్‌ వెల్లడించారు.

 

ఈ సమయంలో ప్రజలు పాటించాల్సిన నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాలను ఇక్కడి ప్రభుత్వం విడుదల చేసింది.. ఈ సమయంలో ప్రజలంతా చాల అప్రమత్తంగా ఉండాలని, ఎట్టిపరిస్దితుల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇక పురాతమైన ఇళ్లల్లో ఉంటున్న వారు వెంటనే ఆ ప్రదేశాన్ని ఖాళీచేసి వెళ్లాలని పేర్కొంటున్నారు.. అంతే కాకుండా ఇంట్లోకి సరిపడ సరకులను, పరిశుభ్రమైన తాగునీటిని సమకూర్చుకోవాలని చెబుతున్నారు.. విద్యుత్ విషయంలో మాత్రం అసలే నిర్లక్ష్యం వహించకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.. కాబట్టి ముంబై వాసుల్లారా మీ జాగ్రత్తలో మీరు ఉండటం ఉత్తమం.. ఇక కరోనా విషయంలో కూడా అలర్ట్‌గా ఉండగలరని వైద్య అధికారులు చెబుతున్నారు..