హాథ్రాస్‌ ఘటనపై కొనసాగుతున్న సిట్ విచారణ..!

-

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హ‌త్రాస్‌లో ద‌ళిత యువ‌తి గ్యాంగ్ రేప్‌కు గురైన విష‌యం తెలిసిందే. ఆ యువ‌తి హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందింది..ఆ త‌ర్వాత ఆమె మృత‌దేహాన్ని కుటుంబ‌ స‌భ్యులకు అప్పగించకుండా పోలీసులే అర్థ‌రాత్రి ర‌హ‌స్యంగా ద‌హ‌నం చేశారు..దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో సిట్ విచారణ కొనసాగుతుంది..
హాథ్రాస్ బుల్గార్గీ గ్రామానికి చెందిన 20 ఏళ్ల ద‌ళిత యువతిని ఉన్న‌త కులానికి చెందిన న‌లుగురు వ్య‌క్తులు రేప్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి..సెప్టెంబ‌ర్ 14వ తేదీన ఈ ఘ‌ట‌న జ‌రిగింది. లైంగిక దాడి వ‌ల్ల ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెన్నుపూస విర‌గ‌డంతో ఆమెను హాస్పిట‌ల్‌లో చేర్పించారు. కానీ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది..యువతి మృతిపై ప్రతి పక్షాలు, ప్రజాసంఘాలు దేశ వ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి..కాంగ్రెస్‌ నేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఆందోళనలు తీవ్ర తరం చేశారు..బాధిత కుటుంబాన్ని కలుసుకోకుండా అడ్డుకున్న యోగి సర్కార్‌ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం చేశారు..
విపక్షాల ఆందోళనలకు తలొగ్గిన ప్రభుత్వం..ఘటనపై విచారకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది..సిట్‌ ప్రాధమిక దర్యాప్తు ఆధారంగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ తో సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసింది..సిట్ బృందం ఈ రోజు యువతిని దహనం చేసిన ప్రాంతానికి వెళ్లి క్రైమ్‌ సీన్‌ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు..మరోవైపు పోలీసులు చేస్తున్న ఆరోణలపై బాధిత కుటుంబం ఖండించింది..ఘటనపై సీబీఐ దర్యాప్తుకు యోగీ సర్కార్ ప్రతిపాదలను పంపినప్పటికి సీబీఐపై తమకు నమ్మకం లేదంటున్నారు కుటుంబ సభ్యులు.

Read more RELATED
Recommended to you

Latest news