కోహ్లీ బ్యాటింగ్ పై గంగూలీ కీలక వ్యాఖ్యలు

-

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో సెంచరీ సాధించి దాదాపు మూడు నెలలు అవుతుంది. అయితే కోహ్లీ పైన మాజీ క్రికెటర్లు ఫోకస్ చేస్తున్నారు. కోహ్లీని సెలక్టర్లు పక్కన పెట్టాలి అంటూ ఇటీవల మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కోహ్లీకి అండగా నిలబడ్డారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.

ప్రతి క్రీడాకారుడి కెరీర్ లో ఇలాంటి క్లిష్ట పరిస్థితులు తలెత్తుతాయని.. ఇలాంటివి సాధారణమైన విషయాలని అన్నారు.” ఓసారి అంతర్జాతీయ క్రికెట్లో అతను సాధించిన రికార్డులు చూడండి. నైపుణ్యం, సామర్థ్యం లేకుండా ఇది సాధ్యం కాదు కదా. ప్రస్తుతం అతడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ విషయం అతనికి కూడా తెలుసు. కోహ్లీకి తన సామర్థ్యం గురించి అవగాహన ఉంది. త్వరలోనే మునుపటి ఫాంను అందుకు ఉంటే చాలు విజయవంతం అవుతాడు. ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుంది.

సచిన్, రాహుల్, నాకు జరిగాయి. కోహ్లీకి కూడా అదే జరిగింది. భవిష్యత్తులో వచ్చే ఆటగాళ్లకు కూడా జరుగుతుంది. ఇదంతా క్రీడల్లో ఓ భాగం. ఒక క్రీడాకారుడిగా వారు చెప్పేది జాగ్రత్తగా వినీ.. మన ఆట మనం ఆడుకోవాలి” అని సౌరవ్ గంగూలీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news