Budget 2024 : ప్రపంచంలో మూడో పెద్ద ఎకానమీగా భారత్..!

-

భారతదేశ వాస్తవ జీడీపీ వృద్ధి 2024-25లో 7 శాతానికి చేరుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తుంది. మధ్యంతర కేంద్ర బడ్జెట్ కి ముందు ప్రకటించిన నివేదికలో ఇందుకు సంబంధించి కీలక అంశాలను పేర్కొంది. 2030 నాటికి ఇండియా  7 శాతం వృద్ధిని అధిగమించిందని.. ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పేర్కొంది. రానున్న మూడేళ్లలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నట్టుగా పేర్కొంది. 

పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచం కేవలం 2 శాతం వృద్ధి సాధించబోతుందని.. కానీ భారత్ రానున్న రోజుల్లో 7 శాతం వృద్ధి సాధించబోతున్నట్టు ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. దీనిని ఎకనామిక్ సర్వేగా భావించకూడదని నాగేశ్వరన్ స్పష్టం చేశారు. ఆర్థిక నివేదిక ప్రకారం.. భారత వృద్ధిని రెండు దశలుగా విభజించారు. 1950 నుంచి 2014 వరకు ఒకదశ.. 2014-2024 వరకు రెండో దశగా పరిగణించారు. 2012-13, 2013-14 మధ్య కాలంలో ఆర్థిక వ్యవస్థ బలహీనపడినట్టు నివేదిక చెప్పింది. జీడీపీ 5 శాతం కంటే తక్కువ వృద్ధి నమోదు చేసినట్టు తెలిసింది. 

Read more RELATED
Recommended to you

Latest news