ఉపాధ్యాయుల దినోత్స‌వం భార‌త్‌లో సెప్టెంబ‌ర్ 5న‌.. మ‌రి ప్ర‌పంచంలో ఎప్పుడంటే..?

-

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్స‌వాన్ని అక్టోబ‌ర్ 5వ తేదీన జ‌రుపుకుంటారు. మొద‌టి సారిగా దీన్ని 1994లో ప్రారంభించారు. యునెస్కోతోపాటు ఎడ్యుకేష‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ అనే సంస్థ క‌లిసి వ‌ర‌ల్డ్ టీచ‌ర్స్ డేను నిర్వ‌హిస్తున్నాయి.

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి ఏటా సెప్టెంబ‌ర్ 5వ తేదీన మ‌న దేశంలో ఉపాధ్యాయుల దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటామ‌ని అంద‌రికీ తెలిసిందే. ఆ రోజున ఉత్త‌మ ఉపాధ్యాయుల‌ను స‌న్మానిస్తారు. అలాగే మ‌న‌కు చ‌దువు చెప్పిన గురువుల‌ను కూడా గుర్తు చేసుకుంటారు. అయితే ప్ర‌పంచ వ్యాప్తంగా టీచ‌ర్స్ డేను ఎప్పుడు జ‌రుపుకుంటారో, ఎందుకు జ‌రుపుకుంటారో తెలుసా..? అవే విష‌యాల‌ను ఇప్పుడు ఒక్క‌సారి ప‌రిశీలిద్దాం.

do you know about world teachers day

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్స‌వాన్ని అక్టోబ‌ర్ 5వ తేదీన జ‌రుపుకుంటారు. మొద‌టి సారిగా దీన్ని 1994లో ప్రారంభించారు. యునెస్కోతోపాటు ఎడ్యుకేష‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ అనే సంస్థ క‌లిసి వ‌ర‌ల్డ్ టీచ‌ర్స్ డేను నిర్వ‌హిస్తున్నాయి. స‌మాజంలో టీచ‌ర్ల పాత్ర‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసేందుకు, టీచ‌ర్లు విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య‌ను బోధించేలా వారిలో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు గాను ప్ర‌తి ఏటా అంత‌ర్జాతీయంగా అక్టోబ‌ర్ 5వ తేదీన ప్ర‌పంచ ఉపాధ్యాయుల దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు.

అయితే భార‌త్‌లో సెప్టెంబ‌ర్ 5వ తేదీన ఆ డే జ‌రిగితే అందుకు స‌రిగ్గా నెల‌రోజుల్లోనే ప్ర‌పంచ ఉపాధ్యాయుల దినోత్సవం జ‌ర‌గ‌డం విశేషం. ఇక ప్ర‌తి ఏడాది యునెస్కో ఓ కొత్త కాన్సెప్టుతో వ‌ర‌ల్డ్ టీచ‌ర్స్ డేను నిర్వ‌హిస్తూ వస్తోంది. అందులో భాగంగానే గ‌త ఏడాది ”The right to education means the right to a qualified teacher” అనే థీమ్‌తో యునెస్కో వ‌ర‌ల్డ్ టీచ‌ర్స్ డే ను నిర్వ‌హించింది. ఇక ఈ డేను ఆ రోజున ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సుమారుగా 100కు పైగా దేశాల్లో జ‌రుపుకుంటారు. కానీ ఇండియాలో మాత్రం సెప్టెంబ‌ర్ 5వ తేదీనే ఈ దినోత్స‌వం జ‌రుగుతుంది..!

Read more RELATED
Recommended to you

Latest news