ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్: ఎమ్మెల్సీ కవిత

-

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్​లో జరుగుతున్న సాగునీటి దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కేసీఆర్‌ అంటే కాలువలు, చెక్‌డ్యాంలు, రిజర్వాయర్లు అని కవిత పునరుద్ఘాటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు.. కాళేశ్వరం అని చెప్పారు. స్వల్పకాలంలో రాష్ట్ర గతినే మార్చే ప్రాజెక్టును నిర్మించిన ముఖ్యమంత్రిని.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని కాకుండా కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని పిలవాలని సూచించారు.

సీఎం కేసీఆర్ హయాంలో నిజామాబాద్ జిల్లా నీటి పారుదల రంగానికి రూ.5 వేల కోట్లు కేటాయించారని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. పారదర్శక పాలన ఉంది కాబట్టే 21 రోజులపాటు ప్రతి శాఖలో సాధించిన ప్రగతిని వివరిస్తున్నామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాగు నీటి పరిస్థితులు చూసి కేసీఆర్ ఎంత బాధ పడేవారో ఒక బిడ్డగా నాకు తెలుసునని అన్నారు. కాళేశ్వరంతో ఎక్కువ లబ్దిపొందుతుంది నిజామాబాద్ జిల్లాయేనని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news