తెలంగాణను కేసీఆర్ అభివృద్ది చేస్తుంటే..ఏపీని జగన్ ధ్వంసం చేస్తున్నాడు – చంద్రబాబు

తెలంగాణను కేసీఆర్ అభివృద్ది చేస్తుంటే..ఏపీని జగన్ ధ్వంసం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు చంద్రబాబు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ నగర అభివృద్ధికి కృషి చేశాను.. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండటం టీడీపీ ఘనత అంటూ వ్యాఖ్యానించారు.

ప్రతి తెలుగువాడు సంపన్నుడు కావాలన్నదే టీడీపీ లక్ష్యం అని.. విడిపోయిన తర్వాత తెలంగాణ ఆర్ధిక పరిస్థితి మెరుగైందని చెప్పారు. తెలంగాణలో పాలకులు విధ్వంసం చేయలేదని.. కానీ ఏపీలో సీఎం జగన్ విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం చారిత్రాత్మకం అని.. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ అన్నం పెడుతుందా అని ఎగతాళి చేశారని పేర్కొన్నారు. తెలంగాణ టీడీపీ బలమైన పార్టీగా ఎదుగుతుందని.. తెలంగాణ టీడీపీ నేతలు ప్రజల్లో ఉండాలని వెల్లడించారు. రాజమండ్రి మహానాడుకు తెలంగాణ నుండి పెద్దఎత్తున టీడీపీ నేతలు,కార్యకర్తలు వచ్చారు.. ఎన్టీఆర్ ఒక వ్యవస్థ, టీడీపీ సిద్ధాంతాలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయన్నారు చంద్రబాబు.