దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనోత్సవం

-

తెలంగాణ రాష్ట్రం ఎన్నో అడ్డంకులు అధిగమించి తొమ్మిదేళ్లుగా అభివృద్ధి పథంలో దూసుకెళ్లింది. ఈ ఏట జూన్ 2వ తేదీన పదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. 21 రోజుల పాటు రోజుకో శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు.

- Advertisement -

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. గిరిజనోత్సవ సంబురాలు అంబరాన్నంటాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌ పిలుపునిచ్చారు. ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. శతాబ్ద కాలంగా నెరవేరని గిరిజనుల కలలను సీఎం కేసీఆర్‌ దశాబ్ద కాలంలో నెరవేర్చారని ఆమె పేర్కొన్నారు. గిరిజనుల జీవితాల్లో గణనీయమైన మార్పు తెచ్చిన కేసీఆర్‌ గిరిజన జాతికి ఎప్పటికీ ఆరాధ్యుడిగా ఉంటారని అన్నారు. పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించి, గిరిజనుల అభివృద్ధి, వారికి అందుతున్న సంక్షేమ ఫలాలను రాష్ట్రవ్యాప్తంగా తెలిసేలా జరుపుకోవాలని మంత్రి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...