మార్చి 13వ తేదీకి రాజ్య‌స‌భ వాయిదా

-

రాజ్య‌స‌భ బ‌డ్జెట్ స‌మావేశాలు వాయిదా పడ్డాయి. మార్చి 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ ప్రకటించారు. అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారంపై చర్చ చేపట్టాలని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. విప‌క్షాలు ప్ర‌శ్నోత్త‌రాల‌ను అడ్డుకోవ‌డంతో తొలుత స‌భ‌ను 11.50 నిమిషాల వ‌ర‌కు వాయిదా పడింది. ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే ప్ర‌సంగం నుంచి కొన్ని భాగాల‌ను తొల‌గించ‌డాన్ని కూడా విప‌క్షాలు త‌ప్పుప‌ట్టాయి. ఈ అంశంపైన కూడా స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టాయి.

కావాల‌నే స‌భా కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకుంటున్నార‌ని, స‌భ‌ను న‌డిపించే తీరు ఇది కాదని రాజ్య‌స‌భ చైర్మెన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ మండిపడ్డారు. ఇప్ప‌టికే చాలా స‌మ‌యాన్ని వృథా చేశారని, హౌజ్‌లో ఇలాంటి గంద‌ర‌గోళం స‌రికాదని, ప్ర‌జ‌ల ఆశ‌యాల‌కు త‌గ్గ‌ట్లు నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపారు. ఒత్తిడిలో విధులు నిర్వ‌ర్తిస్తున్నట్లు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే చేసిన ఆరోప‌ణ‌ల‌ను చైర్మన్ ఖండించారు. బ‌డ్జెట్ సెష‌న్‌కు చెందిన రెండో ద‌ఫా స‌మావేశాలు మార్చి 13వ తేదీన ప్రారంభం కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news