మిమ్మల్ని మీరు మన్నించడం ముఖ్యం ఎందుకో తెలుసా…?

Join Our Community
follow manalokam on social media

ఇతరులని మన్నించడం మనకి తెలుసు. కానీ మనల్ని మనం మనం మన్నించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎలా అయితే మనం ఇతరులని మన్నిస్తామో అలాగే మనకి మనం కూడా మన్నించుకోవాలి. ఇది ఎందుకు ముఖ్యమో అంటే… మనం మనల్ని మనం ఎంచుకోవడం వల్ల కోపం తగ్గుతుంది. ఎవైరైన మనం తప్పుగా అనుకున్నా ఒపీనియన్ మారిపోతుంది. ప్రతి ఒక్కరూ తప్పులు చేయడం సహజం. ఆ తప్పు నుంచి నేర్చుకోవడం, ఆ తప్పుల్ని తిరిగి రిపీట్ చేయకుండా ముందుకు వెళ్లి పోవడం చాలా అవసరం.

ఇలా చేయడం వల్ల మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మిమ్మల్ని మీరు మళ్ళీ మన్నించుకోవడం ఎలానో తెలుసుకోండి. ఇక దాని కోసం చూస్తే..

మానసిక ఆరోగ్యం:

మిమ్మల్ని మీరు మన్నించుకోవడం వల్ల మీ మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. డిప్రెషన్ లాంటివి ఏమీ ఉండవు. ఇది మీ విజయాల్ని అందుకోవడానికి, ఏకాగ్రతని పెట్టడానికి, ఫోకస్ ని పెట్టడానికి మన్నించడం వలన వీలు అవుతుంది.

శారీరక ఆరోగ్యం:

ఇలా చేయడం వల్ల మీ ఫిజికల్ హెల్త్ కూడా బాగుంటుంది. రీసెర్చ్ ప్రకారం మిమ్మల్ని మీరు మన్నించుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఒళ్ళు నొప్పులు, బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతాయి. హార్ట్ ఎటాక్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది.

రిలేషన్ షిప్స్:

మిమ్మల్ని మీరు మన్నించుకోవడం చాలా మంచి అలవాటు. ఇది మీ రిలేషన్ షిప్ లో కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఇలా మన్నించు కోవడం వల్ల ఎమోషనల్ గా మీరు హెల్తీగా ఉంటారు. దాంతో మీ రిలేషన్ షిప్ కూడా బాగుంటాయి.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...