ఈ రెండు విషయాలని భార్యాభర్తలు గుర్తుంచుకుంటే ఏ బాధా రాదు..!

-

భార్యాభర్తలు ఆనందంగా ఉండాలంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలను జాగ్రత్తగా దాటుకుంటూ వెళ్ళాలి. భార్యాభర్తల మధ్య రోజు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది అయితే ఆ సమస్యలని దాటుకోలేక చాలామంది బంధాన్ని ముక్కలు చేసుకోవడమే మంచిదని భావిస్తూ ఉంటారు. కానీ వచ్చే ఒడిదుడుకులని తట్టుకొని జాగ్రత్తగా దాటుకు వెళ్తే సంసారం చాలా చక్కగా సాగుతుంది.

భార్యాభర్తలు మధ్య వచ్చే చిన్న భేదాభిప్రాయాలు వారి యొక్క బంధాన్ని తెగిపోయే వరకు లాగుతూ ఉంటాయి. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు భార్యాభర్తలు తీసుకుంటే వారి బంధం ఎంతో చక్కగా ఉంటుంది. అయితే మరి భార్యాభర్తలు ఆనందంగా కలిసి జీవించాలంటే ఈ రెండు విషయాలని అసలు మర్చిపోకూడదు. మరి భార్యాభర్తలు గుర్తుపెట్టుకోవాల్సిన ఆ విషయాలను ఇప్పుడు చూద్దాం.

ఈ తప్పుల వల్లనే దూరం పెరుగుతోంది:

భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఇద్దరూ కూడా ఎవరి విషయాలు వాళ్ళు ఇతరులకి చెప్పకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం. ఆదాయం పొదుపు మొదలైన వాటిపైన ఎవరి నిర్ణయం వారు తీసుకుంటున్నారు దీనివలన భేదాభిప్రాయాలు కలుగుతున్నాయి. భార్యాభర్తలు ఎవరు ఎంత సంపాదించినా ఎంత ఖర్చు పెట్టినా సరే దాపరికం ఉండకూడదు. కచ్చితంగా భార్య భర్తకి భర్త భార్యకి విషయాలను చెప్పాలి అప్పుడు కచ్చితంగా వాళ్ళ మధ్య సమస్య ఉండదు. శాశ్వతంగా వాళ్లు కలిసి ఆనందంగా జీవించడానికి అవుతుంది.

కచ్చితంగా ఓ మెట్టు దిగాలి:

చాలామంది భార్యాభర్తలు నేనింత అంటే నేనింత అని అంటూ ఉంటారు పైగా ఒకరి మాటలకి మరొకరు అంగీకరించరు. కానీ అలా చేయడం తప్పు దీనివలన ఇద్దరి మధ్య సమస్యలు కలుగుతాయి. ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటే ఇబ్బందే ఉండదు. కాబట్టి భార్యా భర్తలు ఒక మెట్టు దిగి ఇద్దరు కలిసి చర్చించుకోవడం ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా అవసరం ఈ రెండు విషయాలని కనుక భార్య భర్తలు గుర్తుపెట్టుకుంటే వాళ్ళ బంధం లో ఏ బాధ రాదు ఆనందంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news