పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేస్తున్న పొరపాట్లు.. అవి చేయకపోతే ఏమవుతుందో తెలుసుకోండి..

-

పేరెంటింగ్ పెద్ద టాస్క్ అయిపోతుంది. జెనరేషన్ మారిపోవడంతో పేరెంటింగ్ లో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ప్రపంచం పరుగులు పెడుతుండడంతో వాళ్ళూ అలాగే ఉన్నారు. దానివల్ల పిల్లల పెంపకంలో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులని కొందరు పెద్దగా పట్టించుకోవడం లేదు. మరికొందరు మరీ ఫాస్ట్ గా ఉండి, అసలు పెంపకాన్ని మర్చిపోతున్నారు. ప్రస్తుతం పిల్లల పెంపకంలో పెద్దలు చేస్తున్న తప్పులేమిటో తెలుసుకుందాం.

మేము కష్టపడ్దాం, మా పిల్లలు అలా ఉండకూడదు అని చెప్పి, పిల్లలకి సకల సౌకర్యాలు సమకూరుస్తున్నారు. కనీసం ఇంట్లో అమ్మకి సాయం చేయడం వంటివి కూడా నేర్పట్లేదు. వాళ్ళు అడిగిందల్లా కొనిస్తూ, మా అమ్మా నాన్న నాకోసం ఏదైనా చేయగలరు అనే నమ్మకాన్ని ఇస్తున్నారు. అనుకున్నది చేతికి రాకపోతే ఎలా ఉంటుందో వారికి తెలియకుండా, కావాలనుకున్నది వచ్చేలా చేస్తున్నారు. దానివల్ల జీవితంలో ఫెయిల్యూర్ ఎదురైతే తట్టుకోలేక పోతున్నారు.

డబ్బు విలువ నేర్పట్లేదు. అందుకే ఏది పడితే అది అవసరం లేకపోయినా ఖర్చు చేస్తున్నారు. దేనికైనా డబ్బే ప్రమాణం అని చెబుతున్నారు. బాగా చదివితే మంచి ఉద్యోగం వస్తుంది. బాగా డబ్బులు వస్తాయి అని మాత్రమే చెబుతున్నారు. మనుషుల గురించి అస్సలు చెప్పట్లేదు. అందుకే ఇతరులతో మాట్లాడడం అంతగా రావట్లేదు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, డబ్బులు సంపాదించి వేరే దేశం వెళ్ళడమే గొప్ప అని భావిస్తున్నారు. అలా వెళ్తే నలుగురికి చెప్పుకోవడం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు.

పొగడడం ఎక్కువైపోతుంది. చిన్న పిల్లలు చిన్న పని చేసినా పొగడడం ఎక్కువవుతుంది. అది మామూలు విషయమైనా అదేదో గొప్ప పనిలాగా చెబుతున్నారు. ఆత్మన్యూనతతో బాధపడే పిల్లలకి అలా చెప్పడం మంచిదేమో గానీ, తరచూ అలా చెబుతుండడం కరెక్ట్ కాదు. ఎందుకంటే తమలో అన్ని గొప్ప గుణాలే ఉన్నాయనుకునే పిల్లలు తమలో లోపాల్ని పెద్దగా పట్టించుకోని పరిస్థితి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news