ఉప ఎన్నికలు సీఎంలకు పెను సవాల్…?

-

తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికార పార్టీలకు ఎటువంటి ఇబ్బందీ లేకపోయినా ఉప ఎన్నికల రూపంలో మాత్రం కాస్త గట్టి సవాల్ ఎదురవుతోంది అనే విషయం స్పష్టంగా చెప్పాలి. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో కొన్ని కొన్ని అంశాల్లో ముఖ్యమంత్రులు కాస్త ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఉప ఎన్నికల్లో రెండు పార్టీలు ఓడిపోతే మాత్రం పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద కూడా కాస్త ఇబ్బంది పడవచ్చు అని అంటున్నారు. తెలంగాణ లో సీఎం కేసీఆర్ ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా ముఖ్యమంత్రి జగన్ తిరుపతి లో ఓడిపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అంటున్నాయి. కొంతమంది కీలక నేతలు సమర్థవంతంగా ప్రచారం చేయక పోవడంతో నాగార్జునసాగర్ లో సీఎం కేసీఆర్ ఇబ్బందులు పడుతున్నారు.

అందుకే ఆయన బహిరంగ సభ కూడా నిర్వహించాలని భావించారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని భావించిన ముఖ్యమంత్రి జగన్ వెనక్కు తగ్గారు. అయితే ఇప్పుడు ఈ రెండు ఎన్నికల్లో కూడా అధికార పార్టీలు విజయం సాధించాల్సిన అవసరం ఉందని లేకపోతే మాత్రం కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇద్దరినీ పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సీఎం కేసీఆర్ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ ఎన్నికలను బిజెపి సీరియస్గా తీసుకుని ముందుకు వెళ్లవచ్చు అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news