జీవితంలో ఏది శాశ్వతం కాదు…!

-

ప్రతిరోజు ఒకేలా ఉండదు ఒక్కో రోజు ఒక్కో విధంగా ఉంటుంది. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. మన జీవితం చూడడానికి అందంగా కనపడుతుంది కానీ ఎత్తుపల్లాలు ఉంటూనే ఉంటాయి. ఒక కష్టం తర్వాత మరొక దాని కోసం మనం తాపత్రయ పడుతూనే ఉండాలి ఈరోజు చదువు.. తర్వాత ఉద్యోగం.. ఆ తర్వాత పెళ్లి ఇలా చాలా స్టేజెస్ ని దాటుకుంటూ వెళ్లాలి.

వీటిని దాటే క్రమంలో మనం ఎన్నో అవస్థలు పడుతూ ఉంటాము. ఎన్నో కష్టాలు చూస్తూ ఉంటాము. అయితే ఇలా ప్రతీ దానిని దాటుకుని వెళుతూ ఉంటేనే జీవితం అవుతుంది. అయితే మనం ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అదేంటి అంటే మన చేతిలో ఏదీ ఉండదు.

మన పుట్టుక కూడా మన చేతుల్లో ఉండదు. అన్ని శాశ్వతమనుకొని మనం చిన్న చిన్న విషయాలకి కూడా బాధపడుతూ ఉంటాము అలాగే చిన్న చిన్న విషయాలకి ఆనందపడి పోతాము. జీవితంలో ఎన్నో భిన్నమైన స్థితులు కనబడుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటే ఒక్కసారి ఎనలేని ఆనందంతో పొంగిపోతూ ఉంటాము. ఆనందం లో ఉన్నాం కదా అనుకునేలోపే కన్నీరు వచ్చేస్తూ ఉంటుంది. అయితే భవిష్యత్ గురించి ఆలోచించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకూడదు.

పైగా అవి మన చేతుల్లో ఉండవు కనుక వాటి గురించి పదేపదే ఆలోచిస్తూ కూర్చుంటే ఫలితం లేదు. దాని వల్ల తలనొప్పి ఎక్కడలేని ఒత్తిడి మాత్రమే మనకి మిగిలేది. పైగా ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం పక్కనున్న చిన్న చిన్న సంతోషాన్ని కూడా దూరం చేసుకుంటూ ఉంటాము. ఏదో ఆనందం మన వెంట వస్తూ ఉన్నా సరే దానిని పక్కన పెట్టేసి అనవసరంగా దేని గురించో ఆలోచించి ఒత్తిడిలో ఉండి పోవడం మంచిది కాదు. అయితే మనం సమస్య గురించి ఆలోచించడం లో తప్పు లేదు కానీ ఈ సమయంలో మన చేతిలో ఉండే సంతోషాన్ని వదలకూడదు.

చిన్న చిన్న సంతోషాలని కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి ప్రతి చిన్న విషయాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలి ప్రతి రోజు ఎంతో స్పెషల్ గా మార్చుకోవాలి. ఇవన్నీ చేస్తూనే బాధ్యతను మర్చిపోకూడదు భవిష్యత్తు గురించి ప్రణాళిక వేసుకోవడం మానకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news