మొహాలీలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (11) అవుటైన కాసేపటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (2) కూడా అవుటయ్యాడు. నాథన్ ఎల్లీస్ వేసిన ఐదో ఓవర్లో ఇన్నింగ్స్ వేగం పెంచేందుకు ప్రయత్నించిన కోహ్లీ.. మిడాన్ మీదుగా బంతిని తరలించేందుకు ప్రయత్నించాడు.
కానీ బంతి అతను అనుకున్నంత ఎత్తు ఎగర్లేదు. దీంతో ఇన్‌ఫీల్డ్‌లో ఉన్న కామెరూన్ గ్రీన్‌కు చాలా సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (22 నాటౌట్) నిలకడగా ఆడుతున్నాడు. కోహ్లీ అవుటైన తర్వాత వచ్చిన సూర్యకుమార్.. వచ్చీరావడంతోనే ఫోర్, సిక్స్ బాదడంతో భారత జట్టు పవర్‌ప్లే ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులతో నిలిచింది.