బ్రేకింగ్;ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా..!

-

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ గురించి ప్రజలందరూ భయ బ్రాంతులకు గురవుతున్నారు.ఈ వైరస్ కారణం గా అన్ని దేశాలు ప్రభుత్వాలు అప్రమతంగా ఉన్నాయి . అయితే ప్రజల ఆరోగ్యం గురించి చర్యలు చేపట్టే వైద్య,ఆరోగ్య శాఖ మంత్రికే కరోనా వైరస్ సోకింది. ఈ సంఘటన ఇంగ్లాండ్ లో చోటు చేసుకుంది.యునైటెడ్ కింగ్‌డమ్ ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేస్తున్న నాడిన్ డోరీస్ కు ఈవ్యాది సోకింది.

- Advertisement -

వివరల ప్రకారం డోరీస్ కు తీవ్ర అలసట, జలుబు, జ్వరంతో ఉండటంతో ఆమెకు మంగళ వారం వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అందులో ఆమెకు కరోనా పాజిటివ్ గా గుర్తించారు. దీనితో ఆమెను ఇంట్లోనే ఐసోలేషన్ రూమ్ లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేసారు. కరోన సోకినా మొదటి ఎంపీ నేను అంటూ ఆమె ప్రకటించింది . ఇంగ్లాండ్ లో ఇప్పటి వరకు 380 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వారిలో 6గురు మరణించిన విషయం తెలిసిందే.

అయితే మన ఇండియా లో కరోనా కేసులు సంఖ్య 61 కి చేరింది.ప్రపంచం మొత్తం మీద 119దేశాల్లో కరోనా వ్యాప్తి చెందింది. ఇప్పటికే కరోనా వల్ల 4270 మంది ప్రాణాలుపోగొట్టుకున్నారు.అయితే ఈవ్యాది కి 1.18 లక్షల మంది గురయ్యారు. ప్రారంభంలో ఈ వ్యాది వచ్చిన చైనాలో కరోనా మరణాల సంఖ్య తగ్గుతుంది. కాని ఇటలి లో మాత్రం ఈ వ్యాది తీవ్రత పెరుగుతుంది. మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇటలీ ప్రభుత్వం తగు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కరోనా మహమ్మారి గురించి ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...