మహారాష్ట్రలో ఎనిమిది వేల మంది చిన్నారులకి కరోనా..!

కరోనా మహమ్మారి అనేక ఇబ్బందులని తీసుకు వస్తోంది. ఎంతో మంది కరోనా బారిన పడుతున్నారు. ఈ నెల లో మహారాష్ట్ర అహ్మద్ నగర్ లో ఎనిమిది వేల మంది చిన్నారులు, టీనేజర్స్ కరోనా వైరస్ బారిన పడ్డారు.

కరోనా బారిన పడకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే కరోనా మూడవ వేవ్ ప్రభావం చిన్నారుల్లో చూపిస్తుందని నిపుణులు వెల్లడించిన సంగతి తెలిసినదే. అయితే ఇప్పుడే మహారాష్ట్ర లో మూడవ వేవ్ మొదలై పోయినట్లు తెలుస్తోంది.

కాబట్టి దీనికి సిద్ధంగా ఉండాలి. ఎక్కువ మంది చిన్నారులు కరోనా బారిన పడుతున్నారని.. కోవిడ్ ఆస్పత్రులని పిల్లల కోసం కూడా ఏర్పాటు చేస్తున్నారు అని… అవి ఒక స్కూల్ లాగ లేదా నర్సరీ లాగ ఉంటుందని అన్నారు.

అహ్మద్ నగర్ లో ఎనిమిది వేల మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారని అయితే 10 శాతం కేవలం ఆ ఒక్క జిల్లాలోనే అని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ లో కూడా మహారాష్ట్ర లో అనేకమంది కరోనా బారినపడ్డారు. ఎంతో మంది మరణించారు కూడ.