తొంభైశాతం కరోనా రోగులు ఇంట్లోనే కోలుకుంటారు.. టాప్ డాక్తర్ ట్రెహాన్..

-

కరోనా సెకండ్ వేవ్ వీరవిహారం చేస్తుంది. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉందని వినిపిస్తుంది. అంతే కాదు మొదటి వేవ్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. దానివల్లే రోజు రోజుకీ కరోనా కేసులు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ దిశగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనాల్లో కరోనా పట్ల భయాందోళనలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆక్సిజన్ కొరత, ఆస్పత్రుల్లో బెడ్ల కొరత వంటి వార్తలు చూస్తుంటే ఆ ఆందోళనలు ఇంకా అధికం అవుతున్నాయి.

ఐతే తాజాగా కరోనా మహమ్మారిపై పోరడడానికి కావాల్సిన మార్గాలని సూచించిన భారతీయ డాక్టర్లలో ఒకరైన టెహ్రాన్, కరోనా గురించి మాట్లాడిన మాటలు జనాలకి భరోసాని కలిగిస్తున్నాయి. ఆయనేమంటున్నాడంటే, కరోనా రోగుల్లో 90శాతం మంది ఇంట్లోనే కోలుకుంటారని, ఆర్ తీ పీసీఆర్ టెస్టు పూర్తయ్యి పాజిటువ్ వచ్చిన వెంటనే మీ దగ్గరలోని వైద్యుడిని సంప్రదించి వైద్యం తీసుకుంటే ఇంట్లో ఉండగానే కరోనా నుండి కోలుకోవచ్చు. సకాలంలో టెస్టు చేసుకుని తగిన చికిత్స త్వరగా ప్రారంభిస్తే ఆస్పత్రికి వెళ్ళకుండానే కరోనా బారినుండి బయటపడవచ్చని అన్నాడు.

కోవిడ్ 19బారిన పడ్డ రోగులు ఆరోగ్యంగా ఉండడానికి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చని, అందులో యోగాసనమైన అనులోమ విలోమ ఆసనం ప్రయత్నించవచ్చని అన్నాడు. దానివల్ల ఊపిరితిత్తులు ఆక్సిజన్ బాగా గ్రహిస్తాయని అన్నారు. భారతదేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 16.96 మిలియన్లకు చేరింది. మరణాల సంఖ్య 192,311గా ఉంది. మే నెలలో కరోనా ఉధృతి ఇంకా తీవ్రతరం అవుతుందని వినిపిస్తున్న నేపథ్యంలో మినీ లాక్డౌన్ కి అవకాశం ఉందని వార్తలు మరేమవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news