మూకర్మైకోసిస్ అంటే ఏమిటి…? లక్షణాలు, చికిత్స విధానం తెలుసుకోండి…!

-

మూకర్మైకోసిస్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది మ్యుకర్మైసెట్స్ ద్వారా వస్తుంది. ఇది వాతావరణం మరియు తీసుకునే ఆహారం ద్వారా వస్తుంది. కొందరికి అయితే చూపు కూడా పోయింది. కోవిడ్ నుండి కోలుకున్న వాళ్ళు చాలా మంది ఈ సమస్యతో బాధ పడుతున్నారు.

అసలు ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది…?

గాలి ద్వారా ఇది వ్యాపించవచ్చు. మొదట సైనస్ నుంచి ఇది వస్తుంది. జ్వరం, ముఖం నొప్పి కలగడం, తలనొప్పి, ముక్కు వాయడం, పళ్ళు నొప్పులు, ముక్కులో నుంచి రక్తం కారడం, ముఖం నొప్పి కలగడం లాంటి సమస్యలు వస్తాయి.

ఇటువంటి లక్షణాలు కలిగినప్పుడు ట్రీట్మెంట్ లేకపోతే కళ్ళకి మరియు బ్రెయిన్ కి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి లక్షణాలు కలిగినప్పుడు తల నొప్పి రావడం, కళ్ళు సరిగా కనపడక పోవడం లాంటివి కూడా ఉంటాయి.

ఎలా ట్రీట్మెంట్ చేయాలి..?

వైద్యులు దీనికి మెరుగైన చికిత్స ఇవ్వగలరు. ఆప్తమాలజస్ట్, న్యూరాలజిస్ట్, మైక్రోబిలోజిస్ట్, డెంటల్ సర్జన్ ద్వారా మీరు ట్రీట్మెంట్ తీసుకో వచ్చు. అదే విధంగా షుగర్ కంట్రోల్ చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

బ్లడ్ షుగర్ ని సరిగ్గా అదుపులో ఉంచుకోవడానికి ముందు ట్రీట్మెంట్ చాలా అవసరం. కొన్ని మందులు మరియు సర్జరీ అవసరం పడతాయి. యాంటీ ఫంగల్ ఇంజెక్షన్ కూడా ఇస్తూ ఉంటారు. దీనితో వేగంగా తగ్గుతుంది. అయితే దురదృష్టవశాత్తూ పూర్తిగా ఇన్ఫెక్షన్ తగ్గడం లేదు.

ఎటువంటి సర్జరీ అవసరం..?

సర్జరీ చేసి ఇన్ఫెక్ట్ అయిన టిష్యుని తొలగిస్తారు. ఇఎన్టి సర్జన్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా తొలగించడం వల్ల బతకడానికి వీలవుతుంది.

రాకుండా ఎలా జాగ్రత్త పడొచ్చు…?

డయాబెటిస్ ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్గా బ్లడ్ షుగర్ లెవల్స్ ను చెక్ చేసుకుంటూ ఉండాలి. అదే విధంగా సొంతంగా మందుల్ని వాడకూడదు మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసే వరకు స్టెరాయిడ్స్ లాంటివి తీసుకోకూడదు. ఇలా ముందుగా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news