కొవిడ్‌ తగ్గాక.. నీరసంగా ఉందా?

-

కరోనా వైరస్‌ వల్ల మన జీవితాలు ఇప్పటికే అతలాకుతలమవుతున్నాయి. ప్రతి రోజు మన దేశంలో దాదాపు 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆస్పత్రుల్లో బెడ్, ఆక్సిజన్ల కొరత కూడా ఏర్పడుతోంది. మరోవైపు దాదాపు 80 శాతం మంది కరోనా బారిన పడినవారు ఇంట్లోనే వైద్యం పొందుతున్నారు. అయితే, కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా నీరసంతో బాధపడుతున్నారు చాలా మంది. అది వారి బాడీ వీక్‌నెస్‌ వల్ల అలా జరుగుతోంది. ఈ క్రమంలో వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.


గోరువెచ్చటి పాలు తీసుకోవాలి

రాత్రి పడుకోబోయే ముందు కాచిన వేడి పాలను తాగాలి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఎముకల్లో కూడా నీరసం తగ్గుతుంది.

కూరగాయలు తినాలి

కూరగాయలు తినటం చాలా ముఖ్యం. వివిధ రకాల కూరగాయలను వారి లంచ్, డిన్నర్‌ టైంలో భాగం చేసుకోవాలి. క్యారట్, టోమాటో, బీట్‌రూట్, పాలకూర రసాలను కూడా తీసుకోవాలి.. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్‌ శక్తిని అందిస్తాయి.

ప్రోటిన్, యాంటి ఆక్సిడెంట్‌లు

కొవిడ్‌ వచ్చి తగ్గిన వ్యక్తికి ప్రోటీన్‌ రిచ్‌ డైట్‌ చాలా ముఖ్యం. దీని వల్ల త్వరగా కోలుకుంటారు. జీర్ణక్రియ మెరుగవుతుంది.

ఆవిరి పట్టండి

ప్రతిరోజు రెండు మూడుసార్లు ఆవిరి పట్టుకోవడం వల్ల జలుబు, దగ్గు సమస్యలు తగ్గుతాయి. అలాగే, శ్వాస సంబంధిత వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చు. ముక్కులోని నాసల్‌ సిస్టంకు సంబంధిత సమస్యలను అధిగమించవచ్చు.

మల్టీవిటమిన్స్‌

విటమిన్‌ సీ, జింక్‌ ట్యాబ్లెను డాక్టర్‌ సలహా మేరకు తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా వ్యాధి తగ్గిన తర్వాత ఒకవేళ నెగెటివ్‌ వచ్చినా, మందులు మానేయకూడదు. మల్టీవిటమిన్స్‌ తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్‌ని తొలగిస్తాయి.

నీరు తాగాలి

దాహం వేయకున్న ఎక్కువ శాతం నీరు తాగాలి. కొబ్బరి నీరు, ఇతర జ్యూస్‌లు కూడా తాగాలి.

ఒత్తిడికి లోనవ్వకండి

మీరు రెండోసారి పరీక్షించుకున్నా నెగిటివ్‌ వచ్చినా ఒత్తిడికి లోనవ్వకూడదు. కొన్ని సమస్యలు శరీరంలో వెంటనే తగ్గవు కాబట్టి. ప్రతిరోజు ఎక్సర్‌సైజ్‌ చేయాలి, నడక అలవాటు చేసుకోవాలి.

దూరం పాటించండి

మీరు కాస్త రికవర్‌ అయిన తర్వాత కూడా ఆక్సిజన్‌ లెవల్స్‌ ఎంత ఉందో చెక్‌ చేసుకోండి. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి. ఇలా కొన్ని రోజుల పాటించాల్సి ఉంటుంది. నెగెటివ్‌ వచ్చినా మాస్కు ఓ పది రోజుల పాటు వాడాలి.

లంగ్స్‌ ఎక్సర్‌సైజ్‌

ఇది చాలా ముఖ్యం. బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ను స్పైరోమీటర్‌ ద్వారా చేయాలి. అదేవిధంగా ఇతర లంగ్‌ ఎక్సర్‌సైజ్‌ కూడా చేయాల్సి ఉంటుంది.

పాజిటివ్‌గా ఉండాలి

మీరు కరోనా మహమ్మారితో పోరాడి గెలిచిన వారు కాబట్టి పాజిటివ్‌గా ఉండాలి. కరోనా సోకిన కారణంగా కొన్ని సార్లు డిప్రెషన్‌కు లోనవుతారు. మెంటల్‌ హెల్త్‌పై కేర్‌ తీసుకోవడానికి మెడిటేషన్‌ చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news