ఎయిర్‌టెల్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. వేల కొద్దీ ఇ-బుక్స్‌ను ఉచితంగా చ‌దువుకోవ‌చ్చు..!

-

టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ త‌న  కస్ట‌మ‌ర్ల‌కు బంప‌ర్  ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఇంట్లోనే ఉంటున్న త‌న క‌స్ట‌మ‌ర్లు ఎన్నో వేల పుస్త‌కాల‌ను  ఉచితంగా చ‌దువుకునే వెసులుబాటు  క‌ల్పించింది. త‌న ఇ-బుక్స్ ప్లాట్‌ఫాం అయిన Juggernaut Booksలో ఉన్న వేల పుస్త‌కాల‌ను ఎయిర్‌టెల్  క‌స్ట‌మ‌ర్లు ప్ర‌స్తుతం ఉచితంగా చ‌దువుకోవ‌చ్చు. కేంద్రం దేశ‌వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఈ ఆఫ‌ర్‌ను త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు అందిస్తున్న‌ట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.
airtel offers thousands of free ebooks access on Juggernaut Books
కాగా ఎయిర్‌టెల్ 2017లో Juggernaut Booksను కొనుగోలు చేసింది. అందులో అనేక  ఇ-బుక్స్ వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉన్నాయి. అనేక న‌వ‌ల‌లు, ఎడ్యుకేష‌న్ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక Juggernaut Books యాప్‌ను  ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్లు ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై పొంద‌వ‌చ్చు.
ఈ సంద‌ర్భంగా భార‌తీ ఎయిర్‌టెల్ చీఫ్ ప్రొడ‌క్ట్ ఆఫీస‌ర్ ఆద‌ర్శ్ నాయ‌ర్ మాట్లాడుతూ.. క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల‌వుతున్న నేప‌థ్యంలోనే త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు ఇ-బుక్స్‌ను ఉచితంగా చ‌దువుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌జ‌లు క‌రోనాను అడ్డుకోవాలంటే ఇండ్ల‌కే ప‌రిమితం కావాల‌ని, అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని, బ‌య‌ట‌కు వ‌స్తే సామాజిక దూరం పాటించాల‌ని అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news