కరోనాకు 4 వేల మంది చనిపోతే ఆకలి కేకలకు రోజూ 15వేల మంది చనిపోతున్నారు…!

-

అమ్మో కరోనా మహమ్మారి వచ్చేస్తుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం లక్ష మందికి ఈ వ్యాధి సోకింది. మరో లక్ష మందికి పది రోజుల్లో సోకే అవకాశం ఉందని అంటున్నారు. అంతర్జాతీయంగా అన్ని దేశాలు ఉమ్మడి ప్రణాళిక తో ముందుకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నాయి. మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య 68 కి చేరుకుంది. ఇటలీలో ఒకే రోజు వెయ్యి మందికి కరోనా వ్యాధి సోకింది.

ఖర్మ ఏంటీ అంటే ప్రముఖులకు కూడా కరోనా వ్యాధి సోకింది. సరే అది పక్కన పెడితే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని మహమ్మారిగా ప్రకటించింది. ఇప్పటి వరకు 4 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దీనితో అందరూ జాగ్రత్తలు పడుతున్నారు. మరి ఇక్కడ ఒక సమాధానం ప్రపంచం నుంచి కొందరికి కావాలి. మూడు నెలల కరోనాకి నాలుగు వేల మంది చనిపోతే ఆకలి కేకలతో రోజు 15 వేల మంది చనిపోతున్నారు.

పేరు గొప్ప ఊరు దిబ్బ లాంటి దేశాల్లో రోజు వేల మంది ఆకలి కేకలతో అధికారికంగా చనిపోతుంటే ఎవరికి పట్టడం లేదు. ఎందుకంటే చనిపోయిన వాడి దగ్గర డబ్బు లేదు, ఆకలి తో చస్తున్నా ఏ మీడియా చనిపోయే వాడిని చూడదు. ఇప్పుడు కరోనా బారిన పడిన వాడిలో డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే మీడియా అంత హైలెట్ చేస్తుంది. కాని ఆకలి కేకలతో చనిపోయే వాడు కేవలం పేదవాడు మాత్రమే.

కరోనా కూడా పేద వాడికి వచ్చి ఉంటే అంత హైలెట్ అయ్యేది కాదు ఏమో. కాని రోగం కదా అందరికి ఒకటే న్యాయం చేస్తుంది. ప్రభుత్వాలు కదా కళ్ళకు కనపడిన వాటికే న్యాయం చేస్తాయి. చేస్తాయో లేదో తెలియదు గాని హడావుడి చేస్తాయి. కరోనా కోసం  భారత ప్రభుత్వం అర్మీని దింపే ప్రయత్నం చేస్తుంది. మరి ఆకలి కేకల కోసం ఎం చేస్తుంది…? కరోనా కంటే చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు రోజూ.

Read more RELATED
Recommended to you

Latest news