కరోనా మహమ్మారి మనుషుల ప్రాణాలను బలితీసుకొంటున్న తీరు ఆందోళనకరంగా ఉంది. ఇండియాలో కరోనా వల్ల 90వేలకి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో కరోనా కేసుల్లో రెండవ స్థానంలో ఉన్న మనదేశం, కరోనా కారణంగా చనిపోయిన మృతుల సంఖ్యలోనూ రెండవ స్థానంలో ఉంది. ఐతే కరోనా రికవరీ కేసుల్లో మనదేశం టాప్ లో నిలిచింది. మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాలో మరణాల రేటు తక్కువగా ఉంది.
ఐతే తాజాగా అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 2లక్షలకి చేరింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న అమెరికా కరోకా కేసుల్లో మొదటి స్థానంలో ఉండడమే గాక మరణాల సంఖ్యలోనూ టాప్ లో ఉంది. అత్యంత అభివృద్ది చెందిన దేశంగా గుర్తింపబడుతున్న అమెరికా, మహమ్మారిని నిలువరించడంలో ఫెయిలైందనే చెప్పాలి. ఈ మేరకు అభివృద్ధి చెందుతున్న దేశాలు కొంతమేర కరోనాని నిలువరించడంలో కొంత మెరుగ్గా పనిచేస్తున్నాయి.