ఢిల్లీ త‌ర్వాత ఏపీలోనే.. క‌రోనా వార్‌లో మోడీని మించిన జ‌గ‌న్..!

-

క‌రోనాపై పోరులో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం చేస్తున్న ఏర్పాట్ల‌కు దీటుగా ఒక్క ఏపీలో త‌ప్ప మ‌రే రాష్ట్రంలోనూ ఏర్పాట్లు జ‌ర‌గ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. కొవిడ్‌-19 టెస్టుల్లో దేశంలోనే ఏపీ ముందుంది. ఇక‌, ఇప్పుడు మ‌రో రూపంలోనూ క‌రోనాను అధిగ‌మించేందుకు జ‌గ‌న్ ప్రభుత్వం సైలెంట్ విప్ల‌వం దిశ‌గా అడుగులు వేస్తోంది. అనంత‌పురం జిల్లాలో చేప‌డుతున్న ప్ర‌య‌త్నం.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌శంస‌లు కురిపిస్తోంది. జిల్లాలోని రాప్తాడు సమీపంలోని రామినేపల్లి వద్ద ఉన్న పౌర సరఫరాల సంస్థ గోదాము (వేర్‌హౌస్‌)లోని 12 బ్లాక్‌ల్లో 1,500 పడకలతో ఒక భారీ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ సిద్ధమవుతోంది.

JAGAN
JAGAN

ఈ సెంట‌ర్‌కు సంబంధించిన‌ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. మొత్తం 12 బ్లాక్‌లకు గాను మహిళలకు  ప్రత్యేకంగా రెండు బ్లాక్‌లను కేటాయించారు. కోవిడ్‌ బాధితులకు సేవలు అందించే వైద్యులు, స్టాఫ్‌ నర్సులతో పాటు అక్కడే విధులు నిర్వర్తించే పారిశుద్ధ్య సిబ్బంది ఉండేందుకు పురుషులు, మహిళలకు వేర్వేరుగా అన్ని వసతులతో కూడిన షెడ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.  ఇంత పెద్ద ఎత్తున చేపట్టిన కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ నిర్మాణానికి రూ.8.50 కోట్లు వెచ్చిస్తుండడం గమనార్హం.  వాస్త‌వానికి ప్రపంచంలోనే అతి పెద్ద కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఇటీవల ఢిల్లీలో ఏర్పాటైంది.

సర్దార్‌ పటేల్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా పిలుస్తున్న ఈ సెంటర్‌లో 200 ఎన్‌క్లోజర్లలో 50 బెడ్ల చొప్పున మొత్తం 10 వేల పడకలు ఉన్నాయి. ఆ స్థాయిలో కాకున్నా.. అదే తరహాలో అతి పెద్ద కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను అనంతపురం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రామినేపల్లి వద్ద ఉన్న గోదాముల్లోని ఒక్కో బ్లాకుకు 125 పడకలు చొప్పున 12 బ్లాకుల్లో 1,500 పడకలు ఏర్పాటు చేస్తున్నారు. మహిళా పేషంట్ల కోసం రెండు బ్లాక్‌లు ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. రోగుల కోసం ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టాయిలెట్స్‌ మొత్తం 180 నిర్మిస్తున్నారు. రెండు క్లినికల్ ల్యాబొరేట‌రీల‌ను ఏర్పాటు చేస్తున్నారు.

అందులో ఈసీజీ, ఎక్స్‌రే లకు ప్రత్యేక గదులతో పాటు రక్త పరీక్షలకు ల్యాబ్‌ ఏర్పాటు చేస్తున్నారు. కేర్‌ సెంటర్‌కు పేషంట్‌ చేరుకోగానే సైన్‌బోర్డులో వివరాలు నమోదు చేస్తారు. ఆ వెంటనే ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయిస్తారు. ప్రతి పడకకూ ఓ నంబర్‌ కేటాయిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం ఆస‌క్తిగా మారింది. దీనిపై జాతీయ మీడియాలోనూ ఆదివారం క‌థ‌నాలు రావ‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news