మహారాష్ట్రలో కరోనా వైరస్ ఏ రేంజిలో విజయం విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శరవేగంగా వ్యాప్తిచెందుతూ విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి వైరస్ ప్రజలందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేవలం సామాన్య ప్రజలకే కాదు… ప్రజలకు రక్షణ కల్పించే పోలీసు అధికారులను.. నాయకులను కూడా ఈ వైరస్ వదలడం లేదు. వరుసగా పోలీస్ అధికారులు ప్రజాప్రతినిధులు కూడా కరోనా వైరస్ బారినపడుతుండటం మరింత ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే మహారాష్ట్రలో పలువురు మంత్రులు కరోనా వైరస్ బారిన పడగా తాజాగా మరో కేబినెట్ మంత్రి కి కూడా కరోనా పాజిటివ్ అని వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ లీడర్ మంత్రి అస్లాం షేక్ తాజాగా పరీక్షలు చేసుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. తనకు కరోనా పరీక్షలో పాజిటివ్ అని వచ్చిందని ప్రస్తుతానికి తాను ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి మంత్రిని కలిసిన వారు కూడా కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకుంటున్నారు.